నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేందూర్ దీపాలక్ష్మి, మడావి గణేష్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ సకాలంలో అందించాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని కోరారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతలను ఆపాలని, విద్యాశాఖలో అక్రమంగా డిప్యూటేషన్స్ ఆపాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్నా భోజనం మేస్ ఛార్జీలు పెంచాలి, పెండింగ్లో ఉన్న మధ్యన భోజన బిల్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కనక దత్తాత్రి, పీవైఎల్ రాష్ట్ర నాయకులు మేస్రం మారుతి పాల్గొన్నారు.



