నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ కట్టా సింధుజ తన ఔదార్యాన్ని చాటుకున్నారు.సోమవారం తన వార్డు లోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టాండ్ ఫ్యాన్ ను విరాళం గా అందజేశారు. గత మూడు నెలలుగా తీవ్ర వేసవి తాపంతో పాటు ప్రస్తుతం వర్షాలు ఆలస్యమవడంతో నెలకొన్న ఉక్కపోత కారణంగా విద్యార్థులు తరగతి గదుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వలపర్ల బాబురావు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లగా, విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు స్టాండ్ ఫ్యాన్‌ను విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా కట్టా సింధుజ మాట్లాడుతూ, విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కావ్య,సింధుజ బంధువులు కట్టా రాంబాబు,కట్టా నీరజ, వార్డు పెద్దలు ఆరేపల్లి దుర్గా నాగేశ్వరరావు, మోర్ల వెంకన్న, రజియా బేగం, ఉపాధ్యాయురాలు కావ్య, ఇతర ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.



