తక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నవజాతశిశువుల
అండ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ ముకేష్ కుమార్ లాహోటి
నవతెలంగాణ-కంఠేశ్వర్
వైద్యవృత్తి ఎంతో అంకితభావంతో కూడుకున్నదనీ, భారతదేశంలో వైద్యవృత్తికి ఆధ్యులు బీసీ రాయ్ అనీ, వైద్యవృత్తిలో ఎంతో అంకితభావంతో ఆయన పనిచేశారని తక్ష మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నవతజాత శిశువుల అండ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ ముకేష్ కుమార్ అన్నారు. జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా ఆయన మంగళవారం నవతెలంగాణతో మాట్లాడుతూ.. బీసీ రాయ్ రోగులకు నిస్వార్థంగా సేవలు చేశారనీ, ఆయన ఆశయసాధనలో నేడు ప్రతి డాక్టర్ ఆయనను స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. రోగులకు సేవ చేసే అదృష్టం అందరికీ రాదని, వైద్య వృత్తికి ఒక ప్రత్యేక రోజు ఉండడం చాలా సంతోషకరమన్నారు. ప్రజలకు ఎలాంటి వ్యాధులు వచ్చిన వాటికి సరైన వైద్యం అందించి వారిని పూర్తి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దడంలో వైద్యులు పాత్ర ఎనలేనిదని అన్నారు. ప్రజలకు, అధికారులకు, నాయకులకు, పాత్రికేయ బృందానికి, వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
వైద్యవృత్తికి ఒక ప్రత్యేక రోజు ఉండడం సంతోషకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



