నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్య అధికారుల సూచనలు, సలహాలు పాటిం చాలని, మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమాకాంత్ అన్నారు. నేడు డాక్టర్స్ డే సందర్భంగా ఆయనతో ‘నవ తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
“వర్షాకాలం వచ్చిందంటే రైతులకు ఎంత మేలు జరుగుతుందో అనారోగ్య బాధితులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ కాలంలో ముఖ్యంగా అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కుప్పలు తెప్పలుగా రోడ్లపై, మురికి కాలువలపై, పుట్టుకొచ్చేస్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంటికి చుట్టు పక్కల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడ పడితే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
సాధారణంగా చాలామందికి ఈ కాలంలో యాంటీ బయోటిక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఆసుపత్రికి వచ్చే రోగులు అవసరం లేకున్నా గ్లూకోస్ లు ఇంజక్షన్లను వాడరాదని, దానివల్ల రానున్న రోజుల్లో ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని అన్నారు. ఇదీమరీ అంత మంచిది కాదని నా అభిప్రాయం. వీటికి బదులు శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంపొందిచుకోవడం మంచిది. ఈ కాలంలో పెరిగే బ్యాక్టీరియాల కారణంగా హ్యుమిడిటీ పెరిగి శరీ ఉష్ణోగ్రత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
ఫలితంగా కామెర్లు, మలేరియా, టైఫాయిడ్, కలరా, దగ్గు, జలుబు, జ్వరం, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అధిక ఫైబర్ ఉన్న బార్లీ, గోధుమ, బియ్యం, ఉసిరి వంటి ఆహార పదార్థాలను ఎక్కు వగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా జీర్ణమవడమే కాకుండా శరీరంలోని జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. ప్రకతి ఆయుర్వేదాలైన ఆశ్వగంధ, గురుచి, కేసర్ వంటివి అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉండి ఒత్తిడిని పారదోలుతాయి. తాజా పండ్లు, పచ్చటి కూరగాయలు వంటివి తీసుకోవడం మంచిది. మండల కేంద్రంలోని ఆర్ఎంపి పిఎంపి ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా”మని తెలిపారు.



