Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్యో నారాయణో హరి !

వైద్యో నారాయణో హరి !

- Advertisement -

రేపు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం
నవతెలంగాణ – మల్హర్ రావు

వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా లాంటి వైరస్ నుండి వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడడంలో ముందుంటున్నారు.

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నవతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం..
జూలై 1న అంతర్జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. డాక్టర్స్ డే మొదట 1991లో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధన్ చంద్రరాయ్ కు గౌరవం ఇచ్చేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జూలై 1న జరుపుకుంటారు. ఆయన 1జూలై, 1882న వైద్యులు తమ ప్రాణాలను సైతంపోగొట్టుకున్నారు. బీసీ రాయ్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. వైద్యుల లక్షణం, నిబద్ధత, త్యాగనిరతి అనే పదాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం.

ప్రభుత్వం ఆయన అందించిన సేవలకు గుర్తుగా భారతరత్న ఇచ్చింది. వైద్యుల దినోత్సవాన్ని దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో వేర్వేరు తేదీల్లో జరుపు కుంటారు. వైద్యులకు గ్రీటింగ్ కార్డులు పంపడం, చనిపోయిన వైద్యుల సమాధులపై పూలు ఉంచుతారు. కొవిడ్ మహమ్మారి సమయమంలో వైద్యులు, నర్సులు ఫ్రంట్ లైన్ వారి యర్స్ పోరాటం చేశారు. లక్షలాది మందిని తమ వైద్యంతో కాపాడారు. ఇక కొందరు మొదట వైద్యుల దినోత్సవం మార్చి 28,1933లో జార్జియాలోని విండర్లో నిర్వహించారు. ఈ మొదటి ఆచారంలో వైద్యులు, వారి భార్యలకు కార్డులు పంపడం, డాక్టర్ల తో సహా మరణించిన వైద్యుల సమాధుల పై పుష్పాలు ఉంచడం. డాక్టర్ అండ్ శ్రీమతి విలియం టీ రాండోల్స్ ఇంట్లో అధికారిక విందు వంటివి ఉన్నాయి.

బారో కౌంటి ఆలయన్స్ వైద్యులకు నివాళి అర్పించేందుకు శ్రీమతి ఆల్మండ్ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, ఈ 9 ప్రణాళికను 1933లో బారో కౌంటీ అలయన్స్ అధ్యక్షురాలు విండర్కు చెందిన శ్రీమతి ఈఆర్ హారిస్ జార్జియా స్టేట్ మెడికల్ ఆలయన్సు సమర్పించారు. మే 10, 1934న జార్జియాలోని అగస్టాలో జరిగిన వార్షిక రాష్ట్ర సమావేశంలో తీర్మానం ఆమోదించారు. సెయింట్ లూయిస్, మిస్సోరి, నవంబర్ 19-22,1935లో జరిగిన 29వ వార్షిక సమావేశంలో సదరస్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్స్ ఈ తీర్మానాన్ని ఆలయన్స్ ప్రెసిడెంట్ శ్రీమతి జే.బోనార్ వైట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వైద్యుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -