- Advertisement -
నవతెలంగాణ-వనపర్తి
వనపర్తి జిల్లా డిటిఓగా బాధ్యతలు సేకరించిన సురేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో అఖిల పక్ష ఐక్యవేదిక నాయకులు మంగళవారం గౌరవపూర్వకంగా కలిసి సన్మానించారు. జిల్లా రవాణా సంస్థ అధికారి అయిన సురేష్ కుమార్ ఈ మధ్యనే జిల్లాకు బదిలీ అయి వచ్చారు. సన్మానించిన వారిలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్, టిడిపి నాయకుడు కొత్తగల్ల శంకర్, టీ.జే.ఎస్ నాయకులు మహమ్మద్ షఫీ, ఐక్యవేదిక నాయకులు రాజనగరం రామస్వామి, జుబేర్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



