Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేణుమాధవ్ సేవలు భావితరాలకు ఆదర్శం

వేణుమాధవ్ సేవలు భావితరాలకు ఆదర్శం

- Advertisement -

• పంచాయతీరాజ్ కే వన్నే తెచ్చిన అధికారి 
• జిల్లా అదనపు కలెక్టర్ పురుషోత్తం 
నవతెలంగాణ-పెద్దవంగర 
ప్రజాసేవలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించిన ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్ సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో పురుషోత్తం అన్నారు. పెద్దవంగర ఎంపీడీవో వేణుమాధవ్ పదవీవిరమణ సన్మాన సభను గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అధ్యక్షతన సాయి గార్డెన్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, డీఆర్డీఏ పీడీ మధుసూదన్ రాజు, జిల్లా హార్టికల్చర్ అధికారి మరియన్న, అడిషనల్ డీఆర్డీవో మల్లేశ్వరి తో కలిసి మాట్లాడారు. 36 ఏళ్లుగా ప్రభుత్వ సేవలో ప్రజలకు చేరువై అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, పారదర్శక పాలనకు కృషి చేశారన్నారు.

బాధ్యతాయుతమైన పరిపాలన, మానవీయ దృక్పథం, సేవా తపనతో వేణుమాధవ్ ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవ, పారదర్శక పాలనలో తనదైన ముద్ర వేసిన వేణుమాధవ్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖకు వన్నె తెచ్చిన అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రభుత్వ అధికారులకు పదవీవిరమణ సహజమని, ఎక్కడ విధులు నిర్వర్తించినా ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సహచర అధికారుల ప్రశంసలు అందుకున్నారు. గ్రామాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీల బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్, ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్, ఎంఈవో బుధారపు శ్రీనివాస్, పలువురు ఎంపీడీవో లు, సర్పంచులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -