Tuesday, June 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉరి తీసే వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది?

ఉరి తీసే వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది?

- Advertisement -

అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్ల మీద బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాంగ్‌మెన్’. వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి. హెచ్. రావు నిర్మించారు. ఈ మూవీ ఈనెల 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈక్రమంలో మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి డా. బ్రహ్మానందం, నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ,”హ్యాంగ్‌మెన్’ అనే టైటిల్ చూసి ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నాను. దీన్ని ఎలాంటి ఉద్యోగం అనాలో కూడా నాకు తెలీడం లేదు. ఉరి తీసే వ్యక్తి జీవన విధానం ఎలా ఉంటుంది? అని అనుకుంటూ ఉంటాను. అతని మానసిక వ్యథ ఎలా ఉంటుంది? అనే దాన్ని విహాన్ చక్కగా పట్టుకున్నాడు. అసలు ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం. బ్రహ్మాజీ మంచి విషయం ఉన్న నటుడు. ఎలాంటి పాత్రనైనా పండించగల సత్తా ఉన్న నటుడు. అతనికి ఇంత వరకు సరైన కారెక్టర్ పడలేదే అని నేను అనుకుంటూ ఉంటాను. ‘హ్యాంగ్‌మెన్’ ట్రైలర్‌లో బ్రహ్మాజీ అద్భుతంగా కనిపించారు. ఈ చిత్రంతో బ్రహ్మాజీ అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. సన్నీ పాత్ర కూడా బాగుంది. ఇలాంటి కథను చెప్పిన విహానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇది గొప్ప చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ,’ఇలాంటి కథకు నన్ను అనుకున్న విహాన్‌కి ఎప్పుడూ రుణ పడి ఉంటాను. మేం కష్టాలు పడుతున్న టైంలో అజయ్ మాకోసం వచ్చారు. సినిమా పట్ల ఆయనకున్న అభిరుచికి హ్యాట్సాఫ్. ఇలాంటి కంటెంటె్‌ను ఎంకరేజ్ చేస్తున్న సన్ నెక్ట్స్‌ ప్రతినిధి మా ఎమ్మెస్ నారాయణ కూతురు శశికి థాంక్స్’ అని చెప్పారు. ‘ఇందులో ఎలిమెంట్స్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. మనం చేసే ఉద్యోగాల్లా ‘హ్యాంగ్‌మెన్’ జాబ్ ఉండదు. కొత్త సబ్జెక్ట్, కంటెంట్ వచ్చినప్పుడల్లా ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అందుకే ‘హ్యాంగ్‌మెన్’ కథను రాసుకున్నాను. కథ చెప్పిన తర్వాత బ్రహ్మాజీ నన్నెంతో ఎంకరేజ్ చేశారు` అని విహాన్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -