కథానాయకుడు రవితేజ నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు తొలి పాట ‘ఇరుముడి` కట్టుతో అద్భుతంగా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు లభించిన అద్భుత స్పందన, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ అద్భుతమైన ఫామ్ తో ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘ఇరుముడి కట్టు’ ఒక ఆధ్యాత్మిక భావోద్వేగాలతో కూడిన భక్తి పాట. జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటలో అయ్యప్ప స్వామి భక్తి, నియమ నిష్ఠలు, మండల దీక్ష పవిత్రతను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తితో కలిసి సాహిత్యం అందించారు. అనంతు పవర్ ఫుల్ వోకల్స్ ప్రతి పదానికి భక్తి భావాన్ని జోడించి పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అయ్యప్ప దీక్షకు ప్రతీకగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



