Wednesday, July 1, 2026
E-PAPER
Homeఆటలునేటి నుంచి సీసీపీఎల్‌

నేటి నుంచి సీసీపీఎల్‌

- Advertisement -

సినీ వారియర్స్‌ జెర్సీ ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌
పది జట్లు పోటీపడుతున్న సినీ క్రిక్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ (‌సీసీపీఎల్‌) ‌నేటి నుంచి ఆరంభం కానుంది. తెలుగు సినీ పరిశ్రమలో పని చేస్తున్న నటులు, దర్శకులు, టెక్నిషియన్ల మధ్య స్నేహభావం, క్రీడా స్ఫూర్తి పెంపొందించటం సీసీపీఎల్‌ ‌ఉద్దేశమని నిర్వాహకులు, సినీ వారియర్స్‌ ‌జట్టు స్పాన్సర్స్‌ ‌పిఎస్‌ ‌కొలాబరేషన్స్‌ ‌ఫౌండర్‌ ‌సీఈవో ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌చేతాల తెలిపారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సినీ వారియర్స్‌ ‌జట్టు జెర్సీ, గేమ్‌థాన్‌ ‌పోస్టర్‌‌ను సీనియర్‌ ‌జర్నలిస్ట్‌ ‌కొండబాబుతో కలిసి ప్రవీణ్‌ ‌కుమార్‌ ఆవిష్కరించారు. ‌గేమ్‌‌థాన్‌ ‌కార్యక్రమంతో లీగ్‌ ‌సందర్భంగా టెక్నాలజీ, విద్యా సంస్థలకు మధ్య బలమైన వారధి నిర్మించే విధంగా ప్రోగ్సామ్స్‌ ‌రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. సినీ క్రికెట్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ ‌పోటీలు నేటి నుంచి బేగంపేటలోని స్పోర్ట్స్‌ ‌క్రికెట్‌‌ గ్రౌండ్‌‌లో జరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -