Tuesday, August 11, 2026
E-PAPER
Homeఆటలుడెవిస్‌ కప్‌ జట్టు ఎంపిక

డెవిస్‌ కప్‌ జట్టు ఎంపిక

- Advertisement -

సెప్టెంబర్‌లో దక్షిణ కొరియాతో ఢీ
న్యూఢిల్లీ :
డెవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌లో దక్షిణ కొరియాతో తలపడే భారత జట్టును ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ (ఏఐటీఏ) సోమవారం ప్రకటించింది. సెప్టెంబర్‌ 18, 19న సియోల్‌లోని ఒలింపిక్‌ టెన్నిస్‌ సెంటర్‌లో జరిగే క్వాలిఫయర్‌ పోరుకు మానస్‌ దామ్నె తొలిసారి ఎంపికయ్యాడు. సుమిత్‌ నాగల్‌, దక్షిణేశ్వర్‌ సురేశ్‌, యూకి బాంబ్రి, శ్రీరామ్‌ బాలాజీలు సైతం జట్టులో నిలిచారు. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌ రెండు సింగిల్స్ మ్యాచ్‌లతో పాటు డబుల్స్‌లోనూ యూకి బాంబ్రితో కలిసి కీలక విజయం సాధించి భారత్‌ను గెలుపు పథాన నిలిపిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ నం.19 భారత్‌.. వరల్డ్‌ నం.16 దక్షిణ కొరియాను హార్డ్‌ కోర్టుపై ఎదుర్కొనుంది. సిద్దార్థ్‌ రావత్‌, అర్నవ్‌లు రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ఐదుగురితో కూడిన భారత జట్టుకు రోహిత్‌ రజ్‌పాల్‌ సారథ్యం వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -