Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయంటీఎంసీ మహిళా ఎంపీపై కోడిగుడ్లతో దాడి

టీఎంసీ మహిళా ఎంపీపై కోడిగుడ్లతో దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత… ఆ రాష్ట్రంలో రాజకీయ హింస తీవ్రరూపం దాల్చింది. ప్రతిపక్ష టీఎంసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై దాడి జరిగింది. పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుకాణం వద్ద ఆమెపై కొందరు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనను మహువా స్వయంగా ధృవీకరించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు మహువా ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆమె విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -