Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీబీజీ రామ్ జీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

వీబీజీ రామ్ జీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
వీబీజీ రాంజీ పథకం అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని, మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యదావిధిగా కొనసాగించాలని, అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకెఎంఎస్) రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి అన్నారు. వీబీజీ రామ్ జీ పథకాన్ని జూలై 1 నుండి అమలు చేసే నిర్ణయాన్ని బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం  జాయింట్ కలెక్టర్ కు ఏఐకెఎంఎస్ జిల్లా కార్యవర్గం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ.. మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ను రద్దు చేయడంలో భాగంగానే బీ జే పీ కుట్ర పూరితంగా వీ బీ జీ రామ్ జీ కొత్త పథకాన్ని తెచ్చిందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుండి కూలీలను తప్పించే ప్రయత్నం చేస్తున్న బీ జే పీ మోడీ ప్రభుత్వం అనేక సాంకేతిక కారణాలు ముందుకు తెస్తుందని అన్నారు.

సంవత్సరానికి వంద నుండి125 రోజులకు పెంచుతున్నామని గొప్పగా చెపుతున్న బీ జే పీ సంవత్సరంలో 60 రోజులు వ్యవసాయ పనుల సందర్భంగా ఉపాధి పనిని బంద్ పెట్టడం జరుగుతుందని, ఇక పెంచిందేముందని ప్రశ్నించారు. ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ,రైతు ప్రయోజనాలు ముఖ్యమని చెప్పుకుంటున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు,ఎరువులు పురుగు మందులు సరఫరా చేయడంలో విఫలం అవుతున్నాయని, మరీ ముఖ్యంగా యూరియా కొనుగోలుకు సంబంధించి యాఫ్ ను తేవడం వలన రైతులు అయోమయానికి గురవుతున్నారని యూరియాను కొనలేక పోతున్నారని,వెంటనే యూరియా యాఫ్ ను తీసేయాలని డిమాండ్ చేశారు.

 ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల సోమయ్య, చిర బోయిన రాజయ్య మాట్లాడుతూ,ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ సగానికి పైగా రైతులకు వర్తించేనే లేదని అన్నారు. పెండింగ్ లో ఉన్న పాల రైతుల బిల్లులను పూర్తిగా విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇక్కిరి సహదేవ్,ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల బాల మల్లేష్,జిల్లా సహాయ కార్యదర్శి తమ్మడి అంజయ్య,జిల్లా నాయకులు తమ్మడి రమేష్, వంగాల మధు సూదన్ రెడ్డి,కడకంచి బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -