నవతెలంగాణ -పెద్దవంగర
కాంగ్రెస్ పార్టీ పెద్దవంగర మండల నూతన అధ్యక్షుడిగా రంగు మురళీ గౌడ్ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయనను పలువురు నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. మండల అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలందరిని కలుపుకుని ముందుకు సాగుతానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ ముత్యాల పూర్ణచందర్, సీనియర్ నాయకులు బోనగిరి లింగమూర్తి, జాటోత్ వెంకన్న, వార్డు సభ్యులు చిలుక సంపత్, నాయకులు ముద్దసాని హరి, అనంతరాములు, సతీష్ రెడ్డి, యూత్ నాయకులు నరేష్, అజయ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మురళికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



