- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో డబుల్ బెడ్ రూమ్, మార్కండేయ కాలనీలో గత కొన్ని రోజుల నుండి నీటి సమస్య తలెత్తుతోంది. ఈ విషయమై స్తానికులు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ దృష్టి తీసుకెళ్ళారు. ఈ క్రమంలో ఆయన వెంటనే స్పందించి, ప్రభుత్వ ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో బుధవారం స్థానిక కాలనీవాసి నుండి బోరు లీజుకు తీసుకొని, నూతన మోటర్ బిగించి ప్రారంభించారు. దీంతో ఆయనకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు పస్తం ఆంజనేయులు, పాషికంటి సంపత్ ,జూకంటి సంపత్ ,ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కె సాగర్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -



