ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులకు ఘన సన్మానం
నవతెలంగాణ-ఆలేరు టౌన్
అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని, ఆలేరు పట్టణంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులని బుధవారం ఆలేరు మున్సిపల్ చైర్మన్, బీజన బాలమణి భాస్కర్, పలువురు కౌన్సిలర్లు డాక్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ స్వప్న రాథోడ్ తో ప్రైవేట్ క్లినిక్ ఆస్పత్రి డాక్టర్లు డాక్టర్లు కె.ప్రభాకర్, ప్రతాప్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. అలాగే భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్, డాక్టర్ సౌజన్య, డాక్టర్ ప్రతాపరెడ్డి లని సన్మానించారు.
మరోవైపు మురళి క్లినిక్ లో డాక్టర్ మురహరిని సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ బాలమణి భాస్కర్ మాట్లాడుతూ.. వైద్యో నారాయణ హరి అంటే వైద్యుడు శ్రీమహావిష్ణువుతో సమానమని అన్నారు. ప్రాణం పోసే శక్తి ఆ భగవంతుడిది అయితే, పోతున్న ప్రాణాన్ని నిలబెట్టి తిరిగి సరికొత్త జీవితాన్ని ఇచ్చే దేవుడు వైద్యుడని ఆమె తెలిపారు. కరోనా కాలంలో ప్రతి ఒక్కరు తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చుంటే ఒక్క డాక్టర్ మాత్రమే తలుపులు తెరిచి ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలకు తెగించి పని చేసిన గొప్ప వైద్యులని వారి సేవకు వెలకట్టలేమని ఆమె కొనియాడారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియమ్మ మార్కు, శివ, ఆంజనేయులు,సంపత్,మల్లెల సరిత శ్రీకాంత్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ రెడ్డి,హాస్పటల్ సిబ్బంది ఉమారాణి , భార్గవి , కళ్యాణి, అనూష, సాగర్, శ్రీశాంత్ ప్రభుత్వ ,ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



