Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్యలో విరాళాల స్కాం..నిందితుల నివాసాల్లో పోలీసుల సోదాలు

అయోధ్యలో విరాళాల స్కాం..నిందితుల నివాసాల్లో పోలీసుల సోదాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్యలో రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో పోలీసులు బుధవారం దర్యాప్తును ముమ్మరం చేశారు. విరాళాల నగదు దారి మళ్లింపులో కీలక పాత్ర పోషించిన 8మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా , కరుణేష్ పాండే వంటి నిందితుల నివాసాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆలయ నిధులను అక్రమంగా మళ్లించిన వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా, అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఒక పోలీసు బృందం అనుకల్ప్ మిశ్రా నివాసానికి చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -