రావిరాల గ్రామ సర్పంచ్ కత్తుల కళ్యాణి, నాయబ్ తాసిల్దార్ శ్రీనాథ్
నవతెలంగాణ-నెల్లికుదురు
గ్రామాల్లో ప్రజలకు భూమి సమస్య లేకుండా పరిష్కారం చేసేందుకు భూ రీ సర్వే ప్రభుత్వం చేపట్టిందని ఆ గ్రామ సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం నయాబ్ తాసిల్దార్ శ్రీనాథ్ తెలిపారు. బుధవారం భూభారతి భూరి సర్వే గ్రామసభ అవగాహన సదస్సును ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని నాన్-కాడాస్ట్రల్ భూములకు సంబంధించి, శాస్త్రీయమైన సర్వే మరియు మ్యాపుల నవీకరణ ప్రక్రియ గురించి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఎస్ ఓ పి SOP నిబంధనలు ప్రకారం పిల్లోటు విలేజి ఎస్ఓపి తెలుగు 18 12 25 లోని మార్గదర్శకాల ప్రకారం సర్వే నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులకు స్పష్టం చేయడం జరిగింది అని అన్నారు.
సరిహద్దుల గుర్తింపు: గ్రామ మరియు నివాస సరిహద్దులను కె ఎం ఎల్ ఫైల్స్ ఆధారంగా శాస్త్రీయంగా నిర్ధారించాల్సిన అవసరాన్ని చర్చించామని అన్నారు. ప్రభుత్వ భూముల రక్షణ: చెరువులు, ప్రభుత్వ భవనాలు, నాలాలు మరియు రహదారుల వంటి ప్రభుత్వ స్థలాలను గుర్తించి, వాటి సరిహద్దులను స్థిరీకరించడం. పహాని రికార్డులు: సర్వే బృందానికి పహాని (రెవెన్యూ డేటా) రికార్డులను సమర్పించడం మరియు ఆ వివరాలతో క్షేత్రస్థాయిలో సరిచూసుకోవడం జరుగుతుందని తెలిపారు. పట్టాదారుల భాగస్వామ్యం: భూమి కొలతల సమయంలో ప్రతి పట్టాదారుడు/అనుభవదారుడు స్వయంగా హాజరై, తమ భూమి సరిహద్దులను గుర్తించవలసిందిగా కోరడం. వ్యక్తిగత భూభాగాల ప్రాముఖ్యత: ఉమ్మడి సాగు భూములను కాకుండా, వ్యక్తిగత భూభాగాలుగా విడదీయడం వల్ల యాజమాన్య స్పష్టత మరియు లావాదేవీల సౌలభ్యం పెరుగుతుందని రైతులకు వివరించడం. వివాదాల పరిష్కారం: రికార్డులకు, భూమిపై ఉన్న సాగుకు తేడాలు ఉన్న సందర్భాల్లో, ఆయా కేసులను తహసీల్దారు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడం.
సాంకేతికత వినియోగం: సర్వేలో కోర్సు నెట్‌వర్క్, జిఎన్ఎస్ఎస్ మరియు రోవర్ పరికరాలను ఉపయోగించి ప్రతి 20-30 మీటర్లకు ఒక జిసిపి పాయింట్‌ను సేకరించడం గురించి తెలియజేయడం.
10. 9(2) నోటీసులు: సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత జారీ చేయబడే 9(2) నోటీసుల గురించి, వాటిని స్వీకరించాల్సిన విధానం గురించి చర్చించడం. అప్పీలు అవకాశం: సర్వే రికార్డులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, 60 రోజుల అప్పీలు కాలంలో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని రైతులకు వివరించడం.. తీర్మానం: పైన పేర్కొన్న సర్వే ప్రక్రియకు గ్రామ సభ ఆమోదం తెలుపుతూ, సర్వే బృందానికి మరియు రెవెన్యూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సర్వేర్ బాష్మియా, జిపిఓ ఉపేంద్ర ఉప సర్పంచ్ తరుణ్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.



