- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పదవ వార్షికోత్సవ వేడుకు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పూజలు, అన్నదాన కార్యక్రమాలను ఆ కాలనీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రచ్చవార్ పెంటేష్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కే రామారావు, ప్రధాన కార్యదర్శి సారంగలవార్ గంగారం, ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -



