Thursday, July 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతప్పైతే రాజీనామా చేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు

తప్పైతే రాజీనామా చేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ అప్పులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని గన్ పార్క్ సాక్షిగా తాను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గన్ పార్క్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నేను నా రాజకీయ జీవితంలో ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. కేటీఆర్, హరీష్ రావు నాకు పిల్లలతో సమానం. వాళ్లతో నాకేం చర్చ? నా సవాల్ వాళ్లకు కాదు.. చర్చకు నేరుగా కేసీఆరే రావాలి” అని జూపల్లి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 7.3 లక్షల కోట్లు అప్పు చేసిందని, తాను చెప్పింది అబద్దమైతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని జూపల్లి వివరించారు. కార్పొరేషన్ పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టారని, ఆ అప్పును రైతుల నుంచి వసూలుచేస్తారా అని ఆయన అడిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -