Thursday, July 2, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ ప్రభుత్వం దేశానికి, ప్రజలకు ప్రాణాంతకం: కాంగ్రెస్

మోడీ ప్రభుత్వం దేశానికి, ప్రజలకు ప్రాణాంతకం: కాంగ్రెస్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మోడీ పాలనలో మౌలిక వసతల కల్పనలో అవినీతి రాజ్యమేలుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఢిల్లీ-డెహ్రడూన్ ఎక్స్ ప్రెస్ రహదారిపై గుంతలు పడిన ఫొటొలు పొస్టు చేసింది. ఈ రోడ్డు నిర్మాణాల పనులు మోడీ చేతుల మీదగా ఈ ఏడాది ఏప్రిల్ 26న ప్రారంభించారని, కానీ రోడ్డు వేసిన రెండు నెలల్లోనే గుంతలు పడ్డాయని మండిపడింది. ఈ నాసిరకం రోడ్డు నిర్మాణం కోసం రూ.12వేల కోట్ల నిధులు ఖర్చు చేశారని, రహదారి నిర్మాణంలో అవినీతి స్పష్టంగా కనిస్తోందని, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని ఆందోళన వ్యక్తం చేసింది.దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు క్షీణిస్తున్నాయని, ఇది మొదటి కేసు కాదు, దేశవ్యాప్తంగా వంతెనలు, రోడ్లు, హైవేలు, నీటి ట్యాంకులు, రైల్వే స్టేషన్లు లేదా విమానాశ్రయాల పైకప్పులు ఇలా మౌలిక సదుపాయాలు ప్రతిచోటా కుప్పకూలుతున్నాయని పేర్కొంది. ఈ తరహా అవినీతి సంఘటనలతో మోడి ప్రభుత్వం దేశానికి, ప్రజలకు ప్రాణాంతకం అని కాంగ్రెస్ ఆరోపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -