Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటు బిఎల్వో తొలగింపు

ప్రయివేటు బిఎల్వో తొలగింపు

- Advertisement -

ప్రభుత్వ బిఎల్వోకు బాధ్యతలు అప్పగింత..
నవతెలంగాణ – మల్హర్ రావు

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆన్సాన్ పల్లి గ్రామంలో ఎన్నికల నియమవాలికి విరుద్ధంగా ఓ ప్రయివేటు వ్యక్తిచే సర్ ఓటర్ సవరణ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నారని ఇటీవల మంథని నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి బిఆర్ఎస్ నాయకుడు, 242 బూతు లెవల్ ఏజెంట్ బానోతు రాజ్ కుమార్ ఫిర్యాదు చెసిన విషయం తెలిసిందే. ఈ పిర్యాదుపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి బుధవారం తొలగించారు. తొలగించినట్లుగా మండల తహశీల్దార్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడారు. తొలగించిన బిఎల్వో స్థానంలో ఇదే గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ రమాకు బూతు లెవల్ అధికారిగా బాధ్యతలు అప్పజెప్పినట్లుగా తెలిపారు. రమా గురువారం బాధ్యతలు చేపట్టి సర్ సవరణ పారాలు పంపిణీ కార్యక్రమాన్నీ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -