- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవాఖాన ను శనివారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, వాక్సినేషన్, రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. వైద్య సిబ్బంది రోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారినైనా సహించేది లేదని హెచ్చరించారు. రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డా.కల్యాణ్ చక్ర వర్తి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.శాలిని, డా.దీపక్,సూపర్వైజర్లు, ఏ ఎన్ ఎం లు, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



