Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీడీఓ జగదీష్

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీడీఓ జగదీష్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని డోంగ్లి ఎంపీడీవో జగదీష్ తెలిపారు. గురువారం 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జగదీష్ అధ్యక్షతన మండల ప్రత్యేక అధికారి రమ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా మండల అధికారులు ప్రజలకు వివరించారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతుబంధు, పెన్షన్ల పంపిణీ, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, ఇలా ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాల గురించి క్షుణ్ణంగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రంజిత్ కుమార్, మండల ఎంఈఓ శ్రీనివాస్, ట్రాన్స్కో, మండల ఏవో, ఐసిడిఎస్ సిడిపిఓ కళావతి, డోంగ్లి మండల కేంద్ర స్థానిక సర్పంచ్ రేఖ శివాజీ, పార్టీ వివిధ శాఖల అధికారులు, మండల సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -