Friday, July 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆగివున్న బస్సును ఢీకొట్టిన ట్రక్.. ఐదుగురు మృతి

ఆగివున్న బస్సును ఢీకొట్టిన ట్రక్.. ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటా-అలీగంజ్ రోడ్డు మార్గంలో ప్రయాణికులతో నిలిచి ఉన్న ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సును, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన క్యాంటర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -