- Advertisement -
– కార్యాలయం వద్దు వేచి చూస్తున్నా ఉద్యోగులు..!
నవతెలంగాణ – కోటగిరి: సమయం పదకొండు కావస్తున్న ఎంపిడిఓ కార్యాలయం తాళం తీయకపోవడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులు గా సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులు సమయపాలన లోపం పాటిస్తున్నారని వదంతులు వినిపిస్తుండగా శుక్రవారం ఏకంగా సుమారు 11 గంటలు కావస్తున్న ఎంపిడిఓ కార్యాలయం తాళం తీయకపోవడం పై ఉద్యోగులు ఎదురుచూడడం విద్యుత్ బల్బు వెలుగుతో ఉండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనుల పర్యవేక్షణలో నిత్యం ప్రజల మధ్య ఉండాల్సిన అధికారులు నేడు ఎంపీడీవో కార్యాలయానికే పరిమితం అవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
- Advertisement -



