Friday, July 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రువ్వి సర్పంచ్ మృతి..

రువ్వి సర్పంచ్ మృతి..

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : ముధోల్  మండలంలోని రువ్వి గ్రామ  సర్పంచ్ నక్క మల్లేష్ యాదవ్ శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిజామాబాద్ లో వైద్యం చేయించిన ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. యువ సర్పంచ్ అయిన మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామస్తులు నాయకులు, కన్నీటి పర్వంతమయ్యారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న తరుణంలో సర్పంచ్ మృతి చెందటంగ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి బార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రేపు రువ్వి గ్రామంలో మృతుడి అంత్యక్రియలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -