Friday, July 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మక్క పంట డబ్బులు ఇప్పించండి సారు..

మక్క పంట డబ్బులు ఇప్పించండి సారు..

- Advertisement -

– సింగిల్ విండో చైర్మన్ కు దంపతుల విన్నపం
నవతెలంగాణ-మద్నూర్ : మద్దతు ధర కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మిన మక్క పంటకు డబ్బులు రాలేక ఇబ్బందులు పడుతున్నామని మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కు మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామానికి చెందిన పండరి నాగమణి దంపతులు డబ్బులు ఇప్పించాలని శుక్రవారం నాడు సింగిల్ విండో కార్యాలయానికి వచ్చి విన్నవించారు. మక్క పంట ముగ్గురు పేర్ల పైన తూకం చేయగా ఇద్దరికీ డబ్బులు వచ్చాయని ఇంకొకరి పేరు నా తూకం చేసిన కాట్మోడే పరమేష్ వ్యక్తి పేరున రావాల్సిన డబ్బులు రాలేకపోతున్నాయని వాటిని వెంటనే ఇప్పించాలని వారు చైర్మన్ కు విన్నవించారు మక్క పంట ఒకేసారి ముగ్గురు రైతుల పేరున తూకం చేయగా ఇద్దరికీ రావడం మరొకరికి రాకపోవడం ఏంటని చైర్మన్ పటేల్ సింగిల్ విండో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు కాటుమోడే పరమేష్ కు డబ్బులు రాలేదని సిబ్బంది తెలపడంతో ఆగిపోయిన రైతు డబ్బులు వచ్చే విధంగా చూడాలని సిబ్బందికి ఆదేశించారు డబ్బుల కోసం పై అధికారులకు తెలియజేస్తూ మీ డబ్బులు త్వరగా వచ్చేటట్లు చూస్తానని చైర్మన్ ఆ దంపతులకు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -