నవతెలంగాణ బాల్కొండ : మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో శుక్రవారం పీహెచ్సీ ఆసుపత్రి ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కుండిలను, పూల కుండీలను, కూలర్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకిట్లలో, త్రాగిన కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు. ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని, వాడకుండా ఉన్న కూలర్లలో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్రవంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఈ విమల, లయ తదితరులు పాల్గొన్నారు.
కిసాన్ నగర్ పీహెచ్సీ పరిధిలో ఫ్రైడే డ్రైడే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



