నవతెలంగాణ-భిక్కనూర్ : డయేరియా నివారణ కార్యక్రమాల ముమ్మర నిర్వహణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భిక్కనూర్ పరిధిలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ యేమీమా ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రై డే, స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాలను ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పర్యవేక్షించి తగిన సూచనలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు, పీహెచ్‌సీ సిబ్బంది కలిసి బిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి దోమల నివారణ చర్యలు పాటించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, ఆరోగ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పీహెచ్‌సీ పరిధిలో జ్వరం సర్వే, డ్రై డే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



