నవతెలంగాణ-కంఠేశ్వర్ : జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం సందర్భంగా జూలై 13వ తేదీన జిల్లా వ్యాప్తంగా 1 -19 -సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన కొరకు అల్బెన్దజోల్ మాత్రలు వేయడం వేయడం జరుగుతుంది అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. రాజశ్రీ తెలియజేశారు. ఈ కార్యక్రమం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, సోషల్ వెల్ఫేర్ , బి.సి వెల్ఫేర్ , మైనారిటీ వెల్ఫేర్, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, కళాశాలల్లో , హాస్టల్స్లో, మతపరమైన పాఠశాలలు, కళాశాలల్లో ఈ అల్బెన్దజోల్ మాత్రలు అందించబడుతుంది అని తెలియ జేశారు. అందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున జిల్లాలోని అందరు డిప్యూటీ డి.యం. హెచ్.ఓ లకు, ప్రోగ్రాం ఆఫీసర్స్ కు , పీ. హెచ్. సి. మెడికల్ ఆఫీసర్స్ కు, సూపర్ వైజర్ కు, ఆర్. బి.ఎస్.కే టీమ్స్ కి, ఇతర వైద్య సిబ్బందికి నులిపురుగులు నివారణకు చేపట్టవలసిన చర్యలకి సంబందించి జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా నిర్వహించారు. అన్ని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, మతపరమైన పాఠశాలలు కళాశాలల్లో కూడా ఈ అల్బెన్దజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయాలని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని తెలియజేసారు. అల్బెన్దజోల్ మాత్రలు పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఈ మాత్రలు తీసుకోవడం పిలల్ల ఆరోగ్యానికి మంచిదని, ఈ మాత్ర వల్ల నులిపురుగులను నిర్మూలించి పోషకాహార లోపాలని అరికట్టవచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలియజేసారు ఎవరైనా పిల్లలు అనారోగ్యం కారణంగా కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల ఐన అల్బెన్దజోల్ మాత్రలు జూలై 13వ తారీఖున వేసుకోనట్టయితే మలి విడుత నాడు అనగా జూలై 20 వ తారీఖున తప్పనిసరిగా వేసుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, నోడల్ ఆఫీసర్ డా.నవ్య, డిప్యూటీ డి.యం. హెచ్.ఓ డా.సికిందర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శిఖర, డాక్టర్ నవ్య, డాక్టర్ శ్రావ్య, ఆర్.బి. స్.కె మేనేజర్ సచిన్, డిపిఓ విశాల రాణి, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



