నవతెలంగాణ-సత్తుపల్లి : సింగరేణి సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిలోని లైట్ మోటార్ వెహికల్ సెక్షనులో నూతన ఎస్కార్ట్ క్రేన్‌ను శనివారం ప్రారంభించారు. సుమారు రూ.22.69 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ 12 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్‌తో గనిలో భారీ యంత్రాల నిర్వహణ, ఉత్పత్తి పనులను మరింత వేగవంతం చేసేందుకు ఈ ఆధునిక క్రేన్ ఎంతగానో ఉపయోగపడుతుందని జీఎం శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీఆర్ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్వీఆర్ ప్రహ్లాద్, ఎస్ఓటు జీఎం బొల్లం శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ సోమశేఖరరావు, ప్రాజెక్టు ఇంజనీర్ డి శ్రీనివాసరావు, ఎస్ఓఎం బి. రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు మేనేజర్ (ఆపరేషన్స్) జి. కళ్యాణ్ రామ్, సేఫ్టీ ఆఫీసర్ ఎస్. గోవింద్, ఎస్ఈ ముక్కా శ్రీను, పి. గోపి, కాలరీ ఇంజనీర్ జగదీశ్, సంక్షేమ అధికారులు దారా కావ్య, కె. శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జేవీఆర్-ఓసీలో ఎస్కార్ట్ క్రేన్‌ను ప్రారంభించిన జీఎం శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -



