నవతెలంగాణ – పరకాల
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎంతో పారదర్శకంగా చేపట్టాలని 16వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీధర్ అధికారులను, పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం పరకాల పట్టణంలోని 16వ వార్డు సగర వీధిలో ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్చార్జి, 49వ బూత్ ఇన్చార్జి సీపతి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ మౌనిక వేణు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. బీఎల్వోలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్ల పరిధిలో ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు ధర ఖాస్తులను అందించాలని, అర్హులైన వారందరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కౌన్సిలర్ బండి శ్రీధర్ సూచించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఫారాల పంపిణీ తీరుపై ఆరా తీయడంతో పాటు, ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, బీఎల్వో షీలా తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి: కౌన్సిలర్ బండి శ్రీధర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



