Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఐదు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

 ఐదు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం 33 కేవీ అల్లీపూర్ ఫీడర్‌పై నిర్వహణ పనులు,విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాల నేపథ్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తుమ్మల నవీన్ తెలిపారు. ఈ మేరకు అల్లీపూర్,కిష్టంపేట్,సింగరావుపేట,శ్రీరాంనగర్, కుర్మపల్లి గ్రామాలకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.విద్యుత్ వినియోగదారులు, రైతులు అసౌకర్యాన్ని సహృదయంతో అర్థం చేసుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -