నవతెలంగాణ-మిడ్జిల్
మండల పరిధిలోని రాణిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శనివారం రూ. 15,000/- విలువైన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేశారు. పాఠశాలలోని రికార్డులు భద్రపరుచుకోవడానికి ఐదవ వార్డ్ మెంబర్ రహీం రూ.10,000/- విలువైన ఒక స్టీల్ బీరువా, అలాగే ప్రధానోపాధ్యాయుల కోసం ఒకటో వార్డు మెంబర్ శ్రీకాంత్ రూ. 5,000/- విలువైన ప్రత్యేక కుర్చీని, ఖలీల్ బృందం బ్యాగులు రూ.5000/- దాతలు పాఠశాల సిబ్బందికి అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ మాట్లాడుతూ.. పాఠశాల అవసరాలను గుర్తించి, విద్యార్థుల రికార్డుల భద్రత కోసం బీరువా, కార్యాలయ అవసరాల కోసం కుర్చీని అందజేసిన దాతల ఉదారతను కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇటువంటి విరాళాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. దాతలకు పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవి మల్లేష్, ఉప్ప సర్పంచి ఫర్వీణ, పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రభావతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



