Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని గుల్లా తాండా హెచ్ఎం అఖిల, సర్పంచ్ సుమతి రాథోడ్ యశ్పాల్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం ఉచితంగా ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనిభ్యసిస్తున్నారని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని సామాజిక సేవలో భాగంగా ప్లేట్లు, గ్లాసులు వితరణ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ సుమతి రాథోడ్, జీపీ కార్యదర్శి నాగయ్య,   అంగన్ వాడి టీచర్, గ్రామ పెద్దలు, మహిళలు, ఫ్రధాన ఉపాధ్యాయురాలు అఖిల, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -