Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవంగర
మండల వ్యాప్తంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటుగా, అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్టీ కార్యాలయాల్లో అధికారులు, సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, నాయకులు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్, ఎంపీడీవో సురేష్, ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, ఏపీఎం ఎండీ మహమూద్ పాషా, ఎంఈవో బుధారపు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రంగు మురళి, బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కట్టోజు భాస్కరా చారి, కేజీబీవీ పాఠశాలలో ఎస్ఓ గంగారపు స్రవంతి, బీసీ సంక్షేమ వసతి గృహంలో వార్డెన్ అనపురం లింగన్న, ఏఈవోలు, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందన్నారు. స్వాతంత్ర్యంతోనే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అభివర్ణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -