Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల సౌకర్యార్థనికి తాసిల్దార్ కార్యాలయం మార్చుటకు నిధులు మంజూరు 

ప్రజల సౌకర్యార్థనికి తాసిల్దార్ కార్యాలయం మార్చుటకు నిధులు మంజూరు 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
భీంగల్ మండల ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం పట్టణానికి దూరంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పంచాయతీరాజ్ గెస్ట్ హౌసు కు తరలించే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గెస్ట్ హౌస్ భవనానికి అత్యవసర మరమ్మతుల కోసం నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రూ.9 లక్షలు మంజూరు చేయించారని పేర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే తహసీల్దార్ కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తామని తెలిపారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత రావ్, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు అరిగేలా జనార్ధన్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -