– దుబ్భాక నియెజికవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట
మహిళా అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో మహిళా భవన నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ ల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు.
సంక్షేమ పథకాలను మహిళలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. కుట్టుమిషన్ సైతం మహిళలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంద ని, అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమి టీ చైర్మన్, లింగాపూర్ సర్పంచ్ గాంధారి లతా నరేందర్ రెడ్డి, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ రెడ్డి అమర్, వైస్ చైర్మన్ కొంగ నరసింహులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పంది రాజు, మాజీ అధ్యక్షుడు అక్కం స్వామి, నాయకులు పాగాల కొండల రెడ్డి, మైపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, బండారి రమేష్ గౌడ్, భరత్, జీడిపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.



