Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుని

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుని

- Advertisement -

నవతెలంగాణ- జుక్కల్ 
మండలంలోని కంఠాలి తాండ ఎంపి యూపిపీఏస్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తన అమ్మాయిని దోస్పల్లి గ్రామంలోని ఎంపిపీఎస్ ప్రభుత్వ పాఠశాలలోనే శనివారం నాడు అడ్మిషన్ చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా దోస్త్ పల్లి హెచ్ఎం మాట్లాడుతూ.. మండలంలోని కంఠాలి తాండాలో ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బొద్దిని ప్రియాంక అనే ఉపాధ్యాయిని తన 4 సంవత్సరాలు నిండిన అమ్మాయి కనిష్కాను మండలంలోని దోస్త్ పల్లి ప్రాథమిక పాఠశాలలో యూకేజీలో చేయడం జరిగింది. అడ్మిషన్ ఫార్మ్ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందిచడం జరిగింది. దీని వల్ల  ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలోని ప్రజలలో & తల్లిదండ్రులలో కనీసం ఒక దానాత్మక ధోరణి పెరుగుతుందని అందుకు ప్రియాంక మేడం తన అమ్మాయిని మా పాఠశాలలో చేర్పించడం శుభసూచకమని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల తల్లిదండ్రులు & గ్రామ సర్పంచ్ మారుతి బొద్దిని ప్రియాంక మేడంని అభినందించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -