Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

- Advertisement -

విద్యార్థి ఉద్యమ నాయకులు మాజీ  ఎంపీటీసీ  సిలివేరు విష్ణు
నవతెలంగాణ – మర్రిగూడ 
విచ్చలవిడిగా పెరిగిపోతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే “ఫీజుల నియంత్రణ చట్టం” తీసుకురావాలని మండలంలోని దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఉద్యమ నాయకులు మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.విద్యా వ్యాపారమే పరమావధిగా సాగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల ధనదాహానికి సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిదంగా ప్రైవేటు విద్యాసంస్థలు అనుభవం లేని బస్ డ్రైవర్ లను పెట్టి పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని అన్నారు.

ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు.విద్యా ప్రమాణాలను పెంచడం పక్కన పెట్టి,కేవలం లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలను నడుపుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా,విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల ప్రాంగణాల్లోనే పాఠ్యపుస్తకాలు,నోట్‌బుక్స్,టై,బెల్ట్,మరియు యూనిఫామ్‌లను విక్రయిస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపుతున్నాయని మండిపడ్డారు.బయట మార్కెట్ కంటే రెట్టింపు ధరలకు విద్యార్థులకు సంబంధించిన వస్తువులను పాఠశాలల్లోనే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం అన్యాయం అని అన్నారు.

కళ్ళ ముందే ఇంతటి దోపిడీ జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రశ్నించారు.ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించడానికి తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి.నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు కుక్కల మహేందర్, శివన్నగూడ సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మార్నేని అంతయ్య, మునుగాల నాగిరెడ్డి, నడిమింటి రవి, కేశగోని రామచంద్రం గౌడ్, మెరుగు నాగరాజు, బొమ్మకంటి సిద్దు, యాదయ్య, వెంకటేష్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -