- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
టిపియూఎస్ జుక్కల్ మండల ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పి ఆర్ సి మరియు ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని జుక్కల్ ఎంఆర్ఓ మారుతికి శనివారం నాడు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల టియుపిఎస్ అధ్యక్షులు జై చంద్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా టియుపిఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నమ్ వార్ జనార్ధన్ , మండల కార్యదర్శి సందీప్ జుక్కల్ ఎమ్మార్వో ను కలిసి తమకు రావలసిన పిఆర్సి మరియు ఆరు డీఏలను వెంటనే విడుదల చేసే విధంగా సమస్యలను వివరించి మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా , మండల స్థాయి టి యు పి ఎస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



