Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ (రాజంపేట్)
రాజంపేట గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మహేష్ కు సంయుక్తంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం, అవమానకర వ్యాఖ్యలు చేయడం వల్ల గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్‌హెచ్‌వో ఘటనపై విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -