- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని శ్రీసాయివాణి విద్యానికేతన్ ప్రయివేటు ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ విరమనేని సంపత్ రావుకు సోషల్ సర్వీస్ డాక్టరేట్ అవార్డు వరించింది. ఈ అవార్డును అంతర్జాతీయ తమిళ సాంస్కృతిక విశ్వవిద్యాలయం చెన్నై వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ డాక్టర్ కే.కొత్తవై నాగరాజన్ చేతులమీదుగా సోమవారం చెన్నై లోని మైలాపూర్ హోటల్ లో అందుకున్నారు. దీంతో సంపత్ రావును పలువురు అభినందించారు.
- Advertisement -



