- Advertisement -
హైదరాబాద్ : భారత మార్కెట్లోకి కీవే సంస్థ హైప్ వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.1,99,000గా నిర్ణయిం చింది. 5కిలోవాట్ డ్యూయల్ బ్యాటరీ ఆర్కిటెక్చర్‌తో రూపొందిన ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. కేవలం 2.3 సెకన్లలో 0-40 కి.మీ. వేగాన్ని పుంజుకుంటుంది. డ్యూయల్ ఛానల్ ఎబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది.
- Advertisement -



