ఆర్ఎంపీ, పీఎంపీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్
నవతెలంగాణ – మల్హర్ రావు
సంఘం నియమ నిబంధనలను ప్రతి గ్రామీణ వైద్యుడు పాటించాలని తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్పేర్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్ అన్నారు. ఆదివారం మహాముత్తారం గ్రామీణ వైద్యుల సర్వసభ్య సమావేశం యామన్ పల్లిలో మండల అధ్యక్షుడు ముదురుకుల రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ముఖ్యదితిగా హాజరై మాట్లాడారు.
పల్లెల్లో గ్రామీణ వైద్యులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళవద్దని, పరిమితికి మించిన వైద్యం చేయరాదని సూచించారు. అందరూ ఐక్యంగా ఉంటూ యూనియన్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. కాటారం సబ్ డివిజన్ తోపాటు అన్ని మండల కేంద్రాల్లో యూనియన్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం, నిలిసిపోయిన పారా మెడికల్ శిక్షణ తరగతులు పున:ప్రారంభానికి ఇప్పటికే రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులకు విజ్ఞప్తి చేసినట్లుగా తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మిడుదొడ్ల రాజు, సహాయ కార్యదర్శి గొల్లపల్లి సంతోష్, జిల్లా అర్బన్ అధ్యక్షుడు భరత్, మండల ప్రధాన కార్యదర్శి శనిగరపు శంకర్, కోశాధికారి మహేష్ తోపాటుతోపాటు ఆయా గ్రామాల గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.



