- Advertisement -
నవతెలంగాణ-దామరగిద్ద
మండల పరిధిలోని ఉలిగుండం గ్రామ జీపీఓ సత్తయ్య పలు అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపనలు వినిపిస్తున్నాయి. గ్రామానికి చెందిన రమేష్ తండ్రి రామలప్ప దగ్గర భూమి విరాసత్, డిఎస్ పెండింగ్ చేయిస్తానని రూ.10000/-, ఫయాజ్ సన్నాఫ్ షబ్బీర్ కు ఫ్యామిలీ సర్టిఫికెట్ చేయిస్తానని రూ.2000/-, మరొక వ్యక్తి వెంకటేష్ దగ్గర రూ.20 వేలు తీసుకున్నట్టు తెలిసింది. ఇలా ప్రతి పనికి డబ్బులతో ముడి పెడుతున్నాడని ప్రజలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, జిపిఓపై కఠిన చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని సోమవారం తహసీల్దార్ తిరుపతయ్యకు భాదితులు ఫిర్యాదు చేశారు.
- Advertisement -



