నవతెలంగాణ-హైదరాబాద్: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టులో పేట్ బషీరాబాద్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. ఇంకా ఈ కేసులో సాక్షులను విచారణ చేయాల్సి ఉందని.. బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బండి భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని కోర్టులో బాధితురాలి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



