Tuesday, July 7, 2026
E-PAPER
Homeసినిమాప్రేక్షకులకు కృతజ్ఞతలు

ప్రేక్షకులకు కృతజ్ఞతలు

- Advertisement -


విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. ఇటీవల విడుదలై ఈ చిత్రం ఘన విజయం సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ,’ఆడియన్స్ అందరూ కూడా థియేటర్‌కు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ మీద కనిపిస్తుంటే చెప్పులు తీసి సినిమా చూస్తున్నారు. వాళ్ల కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. మేము విమర్శకులను ఎప్పుడూ గౌరవిస్తాం. కాకపోతే కొంతమంది విమర్శ కులు సినిమా చూడొద్దని కామెంట్లు చేస్తున్నారు. దయ చేసి అలాంటి కామెంట్లు చేయొద్దు. ఒక సినిమాను చూడాలా వద్దా అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. ‘హర హర మహాదేవ’ నినాదంతో థియేటర్ అంతా మారు మోగుతుంటే ఇంతకంటే గొప్ప అనుభూతి ఏముం టుంది?, మన సనాతన ధర్మం, మన చరిత్రను తెరపై చూస్తూ అద్భుతంగా ఉందంటున్నారు. డైరెక్టర్ చాలా గొప్ప విజన్ తో ఈ సినిమా తీశారు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడాలని కోరుకుం టున్నాను. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. బుక్ మై షోలో సినిమా ట్రెండింగ్‌లో ఉంది` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -