రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు.
ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకోవడం ద్వారా, సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర బృందం సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది.
ఈ ఈవెంట్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ,”రాజా ది రాజా’ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ సినిమా హీరో రుత్విక్ తో పాటు నిర్మాత నిహారిక కూడా చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఇందులో పాటలు చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాలోని విజువల్స్‌లా అనిపిస్తున్నాయి. అనిల్ చాలా అద్భుతంగా ఈ సినిమా తీశాడు. ట్రైలర్‌లో రుత్విక్ యాక్టింగ్ చూస్తుంటే అసలు కొత్త హీరో చేస్తున్నట్లు అనిపించలేదు. చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న యాక్టర్ నటించినట్లు అనిపిం చింది. ప్రతి ఎక్స్‌ప్రెషన్ చాలా అద్భుతంగా ఉంది. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. రొమాన్స్, కామెడీ చేయడం చాలా కష్టం. చాలా టాలెంట్ ఉంటే గానీ ఆ ఎక్స్‌ప్రెషన్స్ రావు. ట్రైలర్‌లో చూస్తుంటే తనలో చాలా ఈజ్ కనిపించింది. నిహారిక తన తొలి సినిమాకి ఎక్కడా క్వాలిటీలో రాజీపడలేదు. ట్రైలర్ చూసిన తర్వాత టీమ్ అంతా చాలా మంచి సినిమా చేశారనే ఫీలింగ్ కలిగిందిఅని అన్నారు. 'ఈ సినిమా ద్వారా నేను నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబో తున్నాను. ఈ జర్నీ చాలా ఎమోషనల్. అనిల్‌తో కలిసి సినిమా చేయడం చాలా అద్భుతమైన అనుభూతి. ప్రేక్షకులను అలరించేలా ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించాం అని హీరో రుత్విక్ చెప్పారు.
థ్రిల్ చేసే విజువల్ వండర్
- Advertisement -
- Advertisement -



